వరంగల్‌లో ఐటీ సంస్థను నెలకొల్పడం ద్వారా తమ కల సాకారమైందని టెక్ మహేంద్రా సీఈవో సీపీ గుర్నానీ, సైయంట్ ఛైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి అన్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ మరింత విస్తరించాలని గుర్నానీ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చేందుకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఇది ప్రారంభం మాత్రమేనని.. వరంగల్‌లో తమ సంస్థను మరింత అభివృద్ధి చేసి, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌తో పనిచేసి బీడు భూముల్లో నీళ్లు పారించారని మోహనరెడ్డి కొనియాడారు. ఐటీ కంపెనీలు ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించకపోతే అక్కడి వారికి అన్యాయం జరిగినట్టేనని అభిప్రాయపడ్డారు. సాంకేతికత వేగంగా వృద్ధి చెందుతోందని, యువత అందిపుచ్చుకోవడం ద్వారా మరింత మందికి ఉద్యోగాలు వస్తాయని గుర్నానీ తెలిపారు. మిగతా కంపెనీలు రాక కోసం తాము కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఇవీచూడండి: టెక్ కేంద్రంగా ఓరుగల్లు: మంత్రి కేటీఆర్