వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. బీంపల్లిలో గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రాన్ని సజావుగా నిర్వహించాలన్నారు. ధాన్యం నిల్వలను వెంటవెంటనే తూకం వేయాలని తెలిపారు. సేకరించిన ధాాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని సూచించారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన చీఫ్ విప్