వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను రాష్ట్ర రైతు సంఘం నేతలు సందర్శించారు. పత్తి యార్డులో కలియతిరుగుతూ పత్తి సాగులో తలెత్తిన ఇబ్బందులను, మార్కెట్ యార్డులో జరుగుతున్న మోసాలను గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌కు వచ్చిన ప్రతి బస్తాను ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర ప్రతి ఒక్క రైతుకు దక్కేలా అధికారులు చర్యలు చేపట్టాలని వ్యాఖ్యానించారు. పత్తికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర 5550 ఏమాత్రం సరిపోదని తెలిపారు. అధిక వర్షాలతో పత్తి దిగుబడి తగ్గిందని. నాణ్యత లోపించిందని. రంగుమారిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కాచిగూడ వద్ద కర్నూలు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ఎంఎంటీఎస్ రైల్