లాక్డౌన్ కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయినప్పటి నుంచి నిర్మానుష్యంగా మారిన వరంగల్ రైల్వే స్టేషన్ ఇవాళ ప్రయాణికులతో సందడిగా మారంది. దిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ప్రత్యేక రైలు వరంగల్‌కు చేరుకుంది. దిల్లీ నుంచి వచ్చిన వారికి రైల్వే స్టేషన్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ప్రయాణికులకు స్వాగతం పలికారు. వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైనకు తరలించారు. రైల్వే స్టేషన్ వద్ద ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
ఇవీ చూడండి: బ్లాక్ పాంథర్ కాదది.... మానుపిల్లే... !!