వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలోని దేవాదుల ఎత్తిపోతల పథకం పనులను సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ సమీక్షించారు. 142 మీటర్ల లోతు నిర్మిస్తున్న సర్జీపూల్ పనులను ఆమె తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్న దేవాదుల మూడో దశ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి... నిర్దేశిత భూములకు రబీ పంటకు నీరు ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు. పని జరుగుతున్న తీరును పరిశీలించి... సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
ఇవీ చూడండి: పరిహారం కోసం 'సజీవ సమాధి'తో రైతుల నిరసన