వరంగల్ పట్టణ జిల్లా కేంద్రంలో రెండో రోజు ఎస్ఐ రాత పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11 వేలకు పైగా అభ్యర్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు మెుదటి పేపర్.... మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు రెండో పేపర్ పరీక్షను నిర్వహించనున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాలకు తీసుకురాకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇవీ చూడండి: పరీక్షలు మళ్లీ వస్తాయి... ప్రాణాలు రావు: హరీశ్ రావు