వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివ రాత్రిని పురస్కరించుకుని.. హన్మకొండలోని అతి పురాతన మైన సిద్దేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకొని సిద్దేశ్వరుడుకి పాలాభిషేకం చేశారు. ఆలయం ముందు దీపాలు వెలిగించి తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. కరోన సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు మాస్కులు ధరించి వచ్చారు.
ఇదీ చదవండి: మహాశివరాత్రి విశిష్టతేంటి.. ఈ రోజు ఏం చేయాలి?