చారిత్రక ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను వరంగల్ పశ్చిమ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఉత్సవాల్లో మొదటి రోజు అమ్మవారికి 1008 కలశాలతో సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. అంతకు ముందుగా అర్చకులు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. పంచామృతాలతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించారు. ఈ కలశాభిషేకం మహోత్సవం తిలకించేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
ఇవీచూడండి: కాడిమోస్తూ వ్యవసాయం..దంపతుల గోస..