ETV Bharat / state

Seasonal diseases: పెరుగుతున్న సీజనల్‌ వ్యాధులు.. పడిపోతున్న ప్లేట్​లెట్స్! - తెలంగాణ వార్తలు

వర్షాలు ముసురుతున్నాయి.. పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.. జలాలు కలుషితమవుతున్నాయి.. దోమలు విజృంభిస్తున్నాయి.. సీజనల్‌ వ్యాధులు(Seasonal diseases) ప్రబలుతున్నాయి.. జ్వరపీడితులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి.. చాలా మందిలో తెల్లరక్త కణాలు పడిపోతున్నాయి.

Seasonal diseases, platelets decreased with rains
పెరుగుతున్న సీజనల్‌ వ్యాధులు, పడిపోతున్న ప్లేట్​లెట్స్
author img

By

Published : Sep 7, 2021, 12:11 PM IST

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఎక్కడిక్కకడ నీరు నిలిచి... దోమలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సీజనల్ వ్యాధులు(Seasonal diseases) ప్రబలుతున్నాయి. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. అంతేకాకుండా చాలామందిలో ప్లేట్​లెట్స్ పడిపోతున్నాయి.

రక్తం లీకేజీ కాకుండా..

రక్తం లీకేజీ కాకుండా జాగ్రత్తలు

ఆరోగ్యకర వ్యక్తి శరీరంలో లక్షన్నర నుంచి నాలుగున్నర లక్షల తెల్లరక్తకణాలు ఉండాలి. ఇవి శరీరంలో ఒకదానికి ఒకటి అతుక్కొని ఉంటాయి. రక్తం బయటకు రాకుండా, లీకేజీ కాకుండా కాపాడుతాయి. జ్వర తీవ్రత ఎక్కువైన వారిలో తెల్లరక్తకణాలు తగ్గిపోతాయి. దీంతో రక్తం ముక్కు, నోటి నుంచి కారుతుంది. మలం రక్తం రంగులోకి మారుతుంది.

వరంగల్‌ ఎంజీఎంలో పీఆర్‌పీ..

వరంగల్‌ ఎంజీఎంలో పీఆర్‌పీ..

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో తెల్లరక్త కణాలు అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. రక్తం నుంచి ప్లాస్మాను వేరుచేసే యంత్రం గతేడాది నుంచి పని చేయడం లేదు. ఇటీవల మలేరియా, డెంగీ విజృంభిస్తుండటంతో అధికారులు కొత్త యంత్రం తెప్పించారు. సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్లేట్‌లెట్స్‌ రిచ్‌ ప్లాస్మా(పీఆర్‌పీ) కావాల్సిన వారు ఎంజీఎం రక్తనిధి కేంద్రంలో సంప్రదిస్తే అందిస్తామని అధికారులు తెలిపారు.

గత రెండేళ్లుగా కొవిడ్‌తో ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే వైరస్‌ తగ్గుముఖం పడుతోంది. కానీ ప్రజలను జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విజృంభిస్తున్నాయి. జ్వర పీడితుల్లో ప్లేట్‌ లెట్ల(తెల్లరక్త కణాలు) శాతం తగ్గుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మలేరియా 259, డెంగీ 47 కేసులు నమోదయ్యాయి. వేల సంఖ్యలో జ్వర బాధితులున్నారు.

దోమలు కుడితే..

విజృంభిస్తున్న దోమలు

దోమల ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి. పరిసరాల్లో నిల్వ ఉన్న శుభ్రమైన నీటిలో పెరిగే ఆడ ఏడిస్‌ అనే ఈజిప్ట్‌ దోమ పగటివేళ కుట్టడం వల్ల డెంగీ వస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి రక్తం తాగి.. ఇతరులను కుట్టడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

లక్షణాలు:

హఠాత్తుగా అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం, కళ్లవెనుక భాగం, కళ్లు, ఒళ్లు నొప్పులు, అధికమైన అలసట, ఆకలి మందగించడంతో పాటు చర్మంపై దద్దుర్లు, మలం నలుపు రంగులో వస్తుంది.

డ్రై డేలు పాటించాల్సిందే..

డ్రై డేలు తప్పనిసరి

దోమల వృద్ధికి పారిశుద్ధ్య నిర్వహణ లోపాలేనని వైద్యులు చెబుతున్నారు.. దోమల నివారణకు మందుల పిచికారీ, ఫాగింగ్‌ లాంటి చర్యలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. ప్రతి శుక్రవారం ప్రభుత్వం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెబుతోంది. కానీ ఎక్కడా చేపట్టిన దాఖలాలు లేవు. దీనిని పకడ్బందీగా అమలు చేయాలి. ఇందులో ప్రజల భాగస్వామ్యం మరింతగా పెరగాలి. ఇళ్ల పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.

సకాలంలో చికిత్స తీసుకోవాలి..

ఎంజీఎం ఆస్పత్రిలో మలేరియా విభాగం అధికారులు రక్తనమూనాలు సేకరించి కాకతీయ మెడికల్‌ కాలేజీలోని వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లో నిర్ధారణ పరీక్ష చేసి రెండురోజుల్లో రిపోర్టు ఇస్తారు. డెంగీకి చికిత్స ఆలస్యం చేస్తే ప్రాణాంతకరంగా మారవచ్ఛు చికిత్స తప్పనిసరిగా సకాలంలో అందించాలి. పారాసిటమాల్‌ మాత్రలు తప్ప నొప్పుల మాత్రలు వాడొద్ధు పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యం మెరుగు పడుతుంది.

- డాక్టర్‌ పోరండ్ల సమ్మయ్య, జనరల్‌ మెడిసిన్‌, ఎంజీఎం ఆసుపత్రి

ఉమ్మడి జిల్లాలో జ్వరపీడితులు

ఇదీ చదవండి: covid precautions : మీ పిల్లలను బడికి పంపుతున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.