నవరాత్రులు అంటే గణపతి మండపాల్లో పూజలు, అర్చనలతో భక్తి పారవశ్యం విరాజిల్లుతూ ఉంటుంది. కానీ అమ్మాయిని కాపాడుకుంటే అమ్మను కాపాడుకోగలమనే ఉద్దేశంతో 'సేవ్ గర్ల్చైల్డ్' అనే నినాదంతో మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్టించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు కొందరు యువకులు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని హమారా హిందుస్థాన్ యూత్ సభ్యులు 'సేవ్ గర్ల్చైల్డ్' అనే నినాదాన్ని ఎంచుకుని తమ ఉద్దేశం ప్రతిమలో కనిపించే విధంగా ప్రత్యేకంగా మట్టి గణపతిని తయారు చేశారు. ఏటా ఏదో ఒక నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సేవ్ గర్ల్చైల్డ్ నినాదంతో మట్టి గణపతి దర్శనం - SAVE GIRL CHILD MATTI GANAPATHI
వరంగల్ యువకులు సేవ్ గర్ల్ చైల్డ్ అనే నినాదంతో మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్టించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేసి అందరి మన్ననలు పొందుతున్నారు.
నవరాత్రులు అంటే గణపతి మండపాల్లో పూజలు, అర్చనలతో భక్తి పారవశ్యం విరాజిల్లుతూ ఉంటుంది. కానీ అమ్మాయిని కాపాడుకుంటే అమ్మను కాపాడుకోగలమనే ఉద్దేశంతో 'సేవ్ గర్ల్చైల్డ్' అనే నినాదంతో మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్టించి ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు కొందరు యువకులు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని హమారా హిందుస్థాన్ యూత్ సభ్యులు 'సేవ్ గర్ల్చైల్డ్' అనే నినాదాన్ని ఎంచుకుని తమ ఉద్దేశం ప్రతిమలో కనిపించే విధంగా ప్రత్యేకంగా మట్టి గణపతిని తయారు చేశారు. ఏటా ఏదో ఒక నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
( ) గణపతి నవరాత్రులు అంటే ఉదయం, సాయంత్రం వేళలో పూజలు, అర్చనలు వంటి కార్యక్రమాలతో గణపతి మండపాలలో భక్తిపారవశ్యం విరాజిల్లుతూ ఉంటుంది. కానీ.. అమ్మాయిని కాపాడుకుంటేనే అమ్మను కాపాడుకోగలం ......అనే ఉద్దేశంతో సేవ్ గర్ల్ చైల్డ్ అనే నినాదంతో మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్ఠించి ప్రజలలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు యువకులు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట బాపూజీ నగర్ లోని హమారా హిందుస్థాన్ యూత్ సభ్యులు సేవ్ గర్ల్ చైల్డ్ అనే నినాదాన్ని ఎంచుకొని తమ ఉద్దేశం ప్రతిమలో కనిపించే విధంగా ప్రత్యేకంగా మట్టి గణపతిని తయారు చేయించుకున్నారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను నివారించాలని ... అందుకు ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిమను తయారు చేయించినట్టు యువకులు తెలుపుతున్నారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక నినాదంతో ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రత్యేకంగా ప్రతిమను తయారు చేయించుకుంటామని....... నవరాత్రులు తాము కొలిచిన గణపతి ఏ కోరిక కోరినా నెరవేరుస్తాడని వారు అంటున్నారు. ఈ ప్రతిమను పూజిస్తూ మహిళలు, చిన్నారులపై అకృత్యాలను నివారించాలని గణపతిని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే తమ గణపతి పర్యావరణ సహితంగా ఉండేవిధంగా ప్రతి సంవత్సరం మట్టి గణపతినే ప్రతిష్ట చేస్తామని వారు తెలిపారు.
byte...
వినయ్, నిర్వాహకుడు.
సదానందం, నిర్వాహకుడు.
సాయికుమార్, నిర్వాహకుడు.
Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
Conclusion:9000417593