వరంగల్ అర్బన్ జిల్లాకేంద్రంలో సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలను పెంచాలని కోరుతూ హన్మకొండలోని ఏకశిలా పార్క్ ఎదుట ధర్నాకు దిగారు. తమకిచ్చే వేతనాలు సరిపోవట్లేదని... అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆందోళనకు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి సంఘీభావం తెలిపారు.
ఇదీ చదవండిః 'కేసీఆర్, కేటీఆర్ అసమర్థులనడానికి ఈ నివేదికే నిదర్శనం'