వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్లోని స్వయంభూ శ్రీశ్వేతార్క మూల గణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు, ప్రధాన అర్చకులు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి, సాయికృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఏడు రకాల ద్రావణాలతో గణపతికి సప్తవర్ణాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. గురువారం రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు దూరప్రాంత భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామి వారి ప్రతిమను పురవీధుల్లో ఊరేగించారు.
ఇదీ చూడండి: ఈ చిన్నారి మాటలకు మోదీ ఫిదా!