ETV Bharat / state

'మాకు మొక్కలంటే ప్రాణం - పొద్దున్నే లేచి వాటిని చూడకపోతే రోజు గడవదు' - Galambi Nursery Warangal

Saidu Galambi Plants Nursery In Warangal : పర్యావరణం పచ్చదనం అంటే ఆమెకు ఎంతో మక్కువ. మొక్కలను చంటిపిల్లల మాదిరిగా పెంచేవారు. ఆ ఇష్టంతోనే మొక్కల పెంపకాన్ని ఉపాధిగా ఎంచుకున్నారు. నర్సరీ ఏర్పాటు చేసి తనతోపాటు మరో పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఓరుగల్లుకు చెందిన సైదు గాలింబి. పూల, పళ్ల మొక్కలే కాదు అనేక ఔషధ మొక్కలను విక్రయిస్తున్నారు.

Saidulu Galimbi Nursery
Saidu Galambi Plants Nursery In Warangal
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 1:08 PM IST

Updated : Jan 18, 2024, 3:57 PM IST

'మాకు మొక్కలంటే ప్రాణం - పొద్దున్నే లేచి వాటిని చూడకపోతే రోజు గడవదు'

Saidu Galambi Plants Nursery In Warangal : వరంగల్‌కు చెందిన సైదు గాలింబికి మొక్కలంటే పంచప్రాణాలు. 26 ఏళ్ల నుంచి మొక్కల పెంపకాన్ని వ్యాపకంగానే కాదు వ్యాపారంగా ఎంచుకొని ఆదాయం పొందుతున్నారు. భూమి లీజుకు తీసుకొని తొలుత నర్సరీని(Nursery) మొదలుపెట్టి, ఇప్పుడు మూడింటికి విస్తరించారు. పచ్చదనం పరిచినట్టుగా ఉన్న ఆ నర్సరీలో 300 రకాల దేశీ, విదేశీ పూలు, పండ్ల, ఔషధ మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా మొక్కలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.

నర్సరీలో కూలీలుగా మారిన పంచాయతీ కార్యదర్శులు

"మొక్కలంటే చిన్నప్పటి నుంచి నాకు ప్రాణం. చెట్లను, మొక్కలను పెంచడం మా మామయ్య వల్ల నాకు అలవాటైంది. పూల, పండ్ల మొక్కలతో పెంపకం​ మొదలు పెట్టాం. ఎంతో ఇష్టంగా నర్సరీని షురూ చేశాం. ఔషధ మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు, బహుమతులు ఇవ్వడానికి ఇలా రకరకాల మొక్కలను పెంచుతున్నాం. మిగతా నర్సరీలో దొరకని మెుక్కలు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడే ఓ స్థలంలో చిన్న చిన్న చెట్లను పెంచుతున్నాం." - సైదు గాలింబి, నర్సరీ నిర్వాహకురాలు

అధ్యాపక వృత్తి వదిలి మొక్కల సంరక్షణలోనే : గత వర్షాకాలంలో వచ్చిన వరదలకు నర్సరీలలోని మొక్కలన్ని మునిగిపోయి కుళ్లిపోయి అపార నష్టం మిగిల్చింగని సైదు గాలింబి తెలిపారు. అయినా వెనకడుగు వేయలేదని చెప్పారు. మళ్లీ ఒక్కో మొక్క తెచ్చి నాలుగు నెలల్లోనే పచ్చటి నర్సరీలకు ప్రాణం పోశామని వెల్లడించారు. వాటిపై ప్రేమతో ఎక్కడికి వెళ్లకుండా నర్సరీల్లోనే ఉంటూ సంరక్షణ చూస్తున్నామని వివరించారు. కొనుగోలు చేసేవారికి బాగా ఎదిగేందుకు సూచనలు ఇస్తున్నామన్నారు. తన ఇద్దరు కుమారులు సైతం అధ్యాపక వృత్తి వదిలి మొక్కల సంరక్షణలోనే పూర్తి సమయాన్ని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.

నర్సరీలో మొక్కలు నిల్..అధికారుల సస్పెండ్​

"మా నర్సరీలో కశ్మీర్​ ఆపిల్​ మొదలుకొని కేరళలో ఉన్న కొబ్బరి మొక్కల వరకు కొత్త రకాల వంగడాలను దిగుమతి చేసుకొని ఇక్కడ ఉన్నటు వంటి ప్రజానీకానికి అందిస్తున్నాం. వివిధ రకాల మొక్కలను తెప్పించాం. మేము నాటిన మొక్కల ఎదుగుదలను చూసి మాకు ఆనందమేస్తుంది. రైతుల నుంచి మంచి ప్రోత్సాహం దొరుకుతోంది. ఇక్కడున్న స్థానికులు మొక్కలను పెళ్లిల్లలో బహుమతులుగా అందిస్తారు." - సైదు గాలింబి, భర్త

Saidulu Galimbi Nursery : గాలింబి నర్సరీలో విభిన్న రకాల మొక్కలు లభిస్తాయని కొనుగోలు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమకు కావాల్సిన మేలు రకాలను ఆ నర్సరీ నుంచే తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు. వివిధ కార్యక్రమాల అతిథులకు బహుమతిగా ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు పలువురు చెబుతున్నారు. ఇష్టమైన పనినే ఉపాధిగా మలుచుకొని ఆనందంతోపాటు ఆదాయం పొందుతూ మరో10 మందికి ఉపాధి కల్పిస్తుడటంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Plantation సరికొత్త ఆలోచనలతో మొక్కల పెంపకం

terrace gardening: మెుక్కలంటే ప్రాణం.. ఇంటి ఆవరణమంతా పచ్చదనం!

Last Updated : Jan 18, 2024, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.