ETV Bharat / state

ఓరుగల్లులో రహదారి ప్రయాణం... నిత్యం నరక ప్రాయం

వరంగల్​... ఈ పేరు వింటే మనకు గుర్తొచ్చేది ప్రసిద్ధ ఓరుగల్లు కోట, వేయి స్తంభాల గుడి వంటి పర్యాటక ప్రదేశాలు. అలాంటి మహానగరంలో రహదారులు చూస్తే నరకప్రాయంగా మారాయి. అభివృద్ధి పేరిట గుంతలు తవ్వి, కంకర పోసి వదిలేశారు అధికారులు. అలాంటి రోడ్లపై ప్రయాణం చేయలేక... ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు.

వరంగల్​ రహదారులు
author img

By

Published : May 17, 2019, 8:25 PM IST

నరకప్రాయంగా మారిన వరంగల్​ రహదారులు

గుంతలు పడిన రహదారులు, కంకర తేలిన రోడ్లు... ప్రయాణం చేయలేక ప్రజలకు ఇబ్బందులు. ఎక్కడో అనుకుంటున్నారా...? కాకతీయుల రాజధాని ఓరుగల్లు మహా నగరంలో. ఇక్కడ ప్రధాన రహదారులన్నీ నరక ప్రాయంగా మారాయి. పలు చోట్ల అధ్వాన్నంగా తయారైన రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.

అభివృద్ధి పేరిట అధ్వాన్నం

జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న రహదారులను మరమ్మతుల పేరిట అధికారులు తవ్వించి వదిలేశారు. నామమాత్రంగా కంకర పోసి చేతులు దులుపుకున్నారు. ఆరెపల్లి, పైడిపల్లి గ్రామాలను కలిపే దేశాయిపేట రహదారిపై ప్రయాణం చేయాలంటేనే నగర వాసులు జంకుతున్నారు. అంతర్గత రహదారి అయినప్పటికీ భారీ వాహనాల రాకతో పూర్తిగా దెబ్బతిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కమిషనర్​ శృతి ఓఝా చొరవతో వీటిని నిలిపివేసినప్పటికీ... కమిషనర్​ బదిలీతో పెద్ద వాహనాల రాకపోకలు యథావిథిగా మొదలయ్యాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రహదారులపై ప్రయాణం చేయాల్సి వస్తుందని వాహన దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వివాదం తెచ్చిన తంటా...

దేశాయిపేట రహదారిని అభివృద్ధి చేసేందుకు కొత్త మున్సిపల్​ కమిషనర్​ గౌతమ్​ ఇంజినీర్లతో ప్రణాళికలు రచించారు. అయితే అప్పటి మేయర్​, మాజీ ఎమ్మెల్యే కొండా దంపతుల మధ్య చెలరేగిన వివాదాలతో పనులకు అడ్డుకట్ట పడింది. అయినప్పటికీ కమిషనర్​ ఆదేశాలతో కిలోమీటరు మేర యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. శాసన సభ ఎన్నికల అనంతరం గౌతమ్​ బదిలీ కావడం వల్ల కథ మళ్లీ మొదటికొచ్చింది. కంకర తేలిన రోడ్లపై ప్రయాణం వల్ల చెలరేగిన దుమ్ము కారణంగా అనారోగ్యం బారిన పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్ధంతరంగా వదిలేసిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని నగర వాసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి : అక్రమంగా కట్టారు.. అధికారులు కూల్చేశారు..

Intro:TG_MBNR_8_17_BHOONIRVASITHULU_BHATTI_VISIT_AVB_C8
CENTRE:-NAGARKURNOOL
CONTRIBUTOR:-MOHAMAD ZAKEER HUSSAIN
CELLNO:9885989452
( ) రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలలో అవాంతరాలు సృష్టిస్తూ ఆగిపోయేలా చేస్తున్నది కోర్టులకు వెళ్లేలా చేస్తున్నది కేసీఆరే అని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు.నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం హెచ్ ఈ సి కంపెనీ ముందు ఆందోళన చేస్తున్న పాలమూరు-రంగారెడ్డి వెంకటాద్రి రిజర్వాయర్ ముంపు నిర్వాసితులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తోపాటు... మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి, దీక్షా శిబిరాన్ని చేరుకొని నిర్వాసితులకు సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరంలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని మా సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.భట్టి మాట్లాడుతూ ....దేశంలో ఎక్కడాలేని విధంగా కెసిఆర్ అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా , నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను అడ్డుకున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఆయన విమర్శించారు. ధనార్జన కోసమే... ప్రజా ప్రయోజనాలను తుంగలో తొక్కినా ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అని విమర్శించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న నిర్వాసితుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని పోలీసుల తీరును ఎండగట్టారు. సాగునీటి ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం మే కాక కంపెనీలకు అండగా ఉంటూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం అని విమర్శించారు. భూములు కోల్పోయిన రైతులను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తూ స్వార్థం కోసం కేసీఆర్ కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల ప్రయోజనాలు ప్రామాణికంగా తీసుకొని 2013 భూసేకరణ చట్టం జీవో విడుదల చేసింది... దీనిని విస్మరించి కెసిఆర్ 123 జీవో తీసుకొచ్చి రైతులను దారుణంగా మోసగించాడని విమర్శించారు. దీక్ష చేపట్టి 11 రోజులు అవుతున్నా ఏ ఒక్కరూ స్పందించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.ఇకనైనా స్పందించకపోతే రైతులకు తాము అండగా నిలబడి ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. మల్లన్నసాగర్ కింద ఇచ్చే పరిహారం ఈ ప్రాంత రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు...AVB
byte:- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

Body:TG_MBNR_8_17_BHOONIRVASITHULU_BHATTI_VISIT_AVB_C8

Conclusion:TG_MBNR_8_17_BHOONIRVASITHULU_BHATTI_VISIT_AVB_C8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.