ETV Bharat / state

వరంగల్​ అర్బన్​ జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురి దుర్మరణం - వరంగల్​ అర్బన్​ జిల్లా రోడ్డు ప్రమాదం

అతి వేగం ప్రమాదకరం... వేగం కన్నా ప్రాణం మిన్నా ఇవన్నీ రాతలకే పరిమితమవుతున్నాయి. వాహనచోదకులు ఇష్టారీతిగా వెళ్లడం వల్ల అనేక మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గత శనివారం కరీంనగర్​ జిల్లా గంగాధరలో టాటా ఏస్​ వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందిన ఘటన మరవక ముందే తాజాగా వరంగల్​ అర్బన్​ జిల్లా హసన్‌పర్తి చెరువుకట్ట వద్ద లారీ, ఆటో ఢీకొనగా ముగ్గురు ఆక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Road Accident In Warangal Urbon District
వరంగల్​ అర్బన్​ జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురి దుర్మరణం
author img

By

Published : Feb 11, 2020, 7:54 PM IST

Updated : Feb 11, 2020, 8:35 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లాలో రోడ్డు ప్రమాదం... ముగ్గురి దుర్మరణం
అతి వేగంతో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోగా... మరో రెండు ప్రాణాలు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి చెరువుకట్ట వద్ద లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొనగా ముగ్గురు ఆక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఓవర్‌టేక్‌ చేయబోయి

అనంతసాగర్‌ నుంచి నలుగురు ప్రయాణికులతో ఆటో హన్మకొండకు బయలుదేరగా... ఓ లారీ వరంగల్‌ నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తోంది. హసన్‌పర్తి చెరువు కట్ట వద్ద ఒకదానికొకటి వేగంగా ఢీకొట్టుకున్నాయి. ఆటో.. ముందున్న ఉన్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. మృతుల్లో బావుపేటకు చెందిన మర్రి శ్రీకాంత్‌, శాంతమ్మ, వర్ధన్నపేటకు చెందిన శ్రావణి ఉన్నారు.

బావుపేటకు చెందిన అరుణ్‌, హసన్‌పర్తికి చెందిన శీలం నవ్య తీవ్రంగా గాయపడగా... వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌ పరిశీలించారు.

ఇదీ చూడండి : మాత్రలు వికటించి 15 మంది విద్యార్థులకు అస్వస్థత

Last Updated : Feb 11, 2020, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.