ETV Bharat / state

ఏసీ గదుల్లో ఉండే కొందరి వ్యాఖ్యలపై మా దృష్టి ఉండదు: రేవంత్​రెడ్డి

Revanth Responded to VenkatReddy Comments: కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్​తో పొత్తు పెట్టుకోమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ను ప్రజలు బంపర్‌ మెజార్టీతో గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మేమే గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు పొత్తుల చర్చే అనవసరమని వెల్లడించారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా ఎవరూ మాట్లాడొద్దని రేవంత్ పేర్కొన్నారు.

Revanth Responded to VenkatReddy Comments

author img

By

Published : Feb 15, 2023, 3:53 PM IST

Revanth Responded to VenkatReddy Comments: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి హాథ్​ సే హాథ్ జోడో యాత్ర దేవరుప్పుల, ధర్మపురం, విస్నూర్​ల మీదుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా, పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు.

Revanthreddy Responded to VenkatReddy Comments: పాద యాత్రలో ప్రతి ఒక్కరూ తమ సమస్యలు నా దృష్టికి తీసుకు వస్తున్నారని, అందరూ మార్పు రావాలని కోరుకుంటున్నారని రేవంత్​ అన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. వరంగల్ డిక్లరేషన్​లో రాహుల్ స్పష్టంగా చెప్పారని ఏ పార్టీతో పొత్తులు ఉండవని, రాహుల్​గాంధీ నిర్ణయాలు అమలు చేయడమే నా బాధ్యత అని రేవంత్​ స్పష్టం చేశారు.

ప్రజలు కాంగ్రెస్​ను అధికారంలోకి తీసుకు రావడానికి సిద్ధంగా ఉన్నారని, అధికారంలోకి వస్తున్నప్పుడు పొత్తుల గురించి చర్చే ఉత్పన్నం కాదన్నారు. బంపర్​ మెజార్టీతో ప్రజలు తమ పార్టీని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వేలు, చిలక జోస్యం, హస్త సాముద్రికం గురించి తనకి తెలియదన్నారు. కొద్ది మంది నాయకులు ఏసీ గదుల్లో ఉండి విలాసవంతమైన జీవితాల కోసం కావలసినప్పుడల్లా రకరకాలుగా మాట్లాడే వారు చేసే వ్యాఖ్యలపై తన దృష్టి ఉండదన్నారు.

ఎన్నికలు ఎప్పుడొస్తాయో, అభ్యర్థులెవరో ఇప్పుడే ఇంకా తెలియదన్నారు. పార్టీలో పరిణామాలను అధిష్ఠానం పరిశీలిస్తూ ఉంటుందని రేవంత్​ పేర్కొన్నారు. పార్టీ సమయానుగుణంగా అన్నింటికీ పరిష్కారం చూపుతుందని ఆయన తెలిపారు.

'ఎట్టి పరిస్థితుల్లో బీఆర్​ఎస్​తో పొత్తు పెట్టుకోం. బంపర్‌ మెజార్టీతో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తారు. మేమే గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు పొత్తుల చర్చ అనవసరం. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా ఎవరూ మాట్లాడొద్దు. సర్వేలు, చిలుక జోస్యాలు నాకు తెలియదు. ఏసీ గదుల్లో ఉండే కొందరి వ్యాఖ్యలపై మా దృష్టి ఉండదు. ఎన్నికలెప్పుడొస్తాయో.. అభ్యర్థులెవరో ఇప్పుడే తెలియదు. పార్టీలో పరిణామాలను అధిష్ఠానం పరిశీలిస్తూ ఉంటుంది. పార్టీ సమయానుగుణంగా అన్నింటికీ పరిష్కారం చూపుతుంది'. -రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇంతకీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే: రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు విషయం తెలిసిందే. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజార్టీ రాదని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లు రావని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్‌ కలవక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే కాంగ్రెస్​లో తీవ్ర దుమారాన్ని రేపాయి.

ఏసీ గదుల్లో ఉండే కొందరి వ్యాఖ్యలపై మా దృష్టి ఉండదు: రేవంత్​రెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.