ఖమ్మం వరంగల్ జాతీయ రహదారి ఖిల్లా వరంగల్ మండలం రామకృష్ణాపురం సమీపంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలను రాత్రికి రాత్రే నరికి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు కొందరు అక్రమార్కులు. నీడనిచ్చే చెట్లను ఎందుకు నరుకుతున్నారని స్థానికులు అడిగితే రోడ్ల విస్తీర్ణం అని.. ఆర్అంండ్ బీ డిపార్ట్ మెంట్ అని పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు.
గత మూడు రోజులుగా చెట్లను భారీ ఎత్తున నరికి వేస్తున్నారు. ఒకపక్క రాష్ట్రప్రభుత్వం హరితహారం మొక్కలు నాటుతుంటే మరోపక్క నీడనిచ్చే చెట్లను ఇలా నరికి వేస్తున్నారు. చెట్లను తొలగించొద్దని స్థానికులు కోరుతున్నారు.
ఇప్పటికే పదుల సంఖ్యలో భారీ వృక్షాలను మాయం చేశారు అక్రమార్కులు. లారీలు ,డీసీఎంల్లో దుంగలను తరలిస్తున్నారు.