హన్మకొండలో ఇవాళ ఉదయం జోరు వాన(rain in hanamkonda) కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో నగరం తడిసిముద్దయింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగిపొర్లాయి. డ్రైనేజీ నీళ్లు రోడ్లపైకి రావడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఏకధాటిగా వర్షం(rain in hanamkonda) కురుస్తుండటం వల్ల నగర ప్రజలు బయటకు రావడం లేదు. పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
అదే రిపీట్..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, కాజీపేట్ ప్రాంతాల్లోనూ తెల్లవారుజాము నుంచి నిరంతరాయంగా వాన(rain in hanamkonda) కురుస్తోంది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్దనగరం వరంగల్. ఇప్పుడు ఈ మహానగరాన్నీ వరద కష్టాలు వీడట్లేదు. గతేడాది ఆగస్టులో వారం రోజుల పాటు కురిసిన వర్షాని(rain in hanamkonda)కి నగరం పూర్తిగా జలదిగ్భందనమైంది. ఆ ఘటనతో అప్రమత్తమైన అధికారులు నాలాల చుట్టూ ఆక్రమణలు తొలగించారు. ఇక వరంగల్‌కు వరద ముంపు లేదని ధీమాగా ఉన్నారు. కానీ.. గత నెలలో కురిసిన వానకు అదే పునరావృతమైంది. ఇప్పుడు కురుస్తున్న వర్షాల(rain in hanamkonda)కూ అదే వరద ముంచుకొస్తోందని స్థానికులు వాపోతున్నారు.
ఆందోళనలో..
వర్షం(rain in hanamkonda) వచ్చిన తరువాత హడావుడి చేసే బల్దియా అధికారులు, సిబ్బంది.. కాస్త ముందుగా స్పందిస్తే తమకు కష్టాలు ఉండవని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అలసత్వం వీడి నాలాల్లో పూర్తిగా పూడిక తీయాలని, డ్రైనేజీల్లో వ్యర్థాలను తొలగించాలని వేడుకుంటున్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు(rain in hanamkonda) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
రేపు రాష్ట్రంలో వర్షాలు..
రాష్ట్రంలో సోమవారం ఓ మోస్తరుగా, మంగళవారం అక్కడక్కడ భారీ వర్షాలు(rain in hanamkonda) కురిసే అవకాశాలున్నాయని వాతావరణకేంద్రం తెలిపింది. ఆదివారం ఆరు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.