వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట, ధర్మసాగర్, వేలేరు మండలాలలో ఇవాళ సాయంత్రం విపరీతమైన గాలులతో కూడిన వర్షం పడింది. అధిక వేగంతో వీచిన గాలులకి ధర్మసాగర్ మండలం రాపాకపల్లిలో ఇంటి ప్రహరీ గోడ కూలిపోయింది. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి ఇంటి పైకప్పులపై పడ్డాయి. గ్రామాలలోని రోడ్లపై గుంతలలో వర్షపు నీరు చేరడం వల్ల రోడ్లన్నీ బురదమయంగా మారి.. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వేళ ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాతావరణం కొంత చల్లబడింది. ఎండ వేడి గాలులతో అతలాకుతలం అవుతున్న ప్రజలకు... వర్షం కారణంగా వేడివాతావరణం నుంచి కొంత ఉపశమనం కలిగింది.
ఈదురుగాలులతో కూడిన వర్షం... రోడ్లన్నీ జలమయం - RAIN
వరంగల్జిల్లాలోని కొన్ని మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు ఇంటి పైకప్పులపై పడ్డాయి. ఓ ఇంటి ప్రహారీ గోడ కూలింది. రోడ్లపై వర్షపు నీరు చేరడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

TAGGED:
RAIN