ETV Bharat / state

కోచ్​ ఫ్యాక్టరీ సాధన కార్యాచరణ ప్రకటించిన జేఏసీ - జేఏసీ కార్యాచరణ

కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కోసం రగడ కొనసాగుతోనే ఉంది. ఫ్యాక్టరీ సాధనకోసం పోరుకు సిద్ధమైన రైల్వే కోచ్ డివిజన్ పోరాట సమితి.. కార్యాచరణ ప్రకటించింది. ఫ్యాక్టరీ ఆవశ్యకతపై చైతన్య యాత్ర చేయబోతున్నట్లు వెల్లడించింది. గల్లీ నుంచి దిల్లీ వరకూ ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించింది.

Railway Coach Division
కోచ్​ ఫ్యాక్టరీ సాధనకోసం కార్యాచరణ
author img

By

Published : Mar 17, 2021, 2:27 PM IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం పోరుకు సిద్ధమైన రైల్వే కోచ్ డివిజన్ పోరాట సమితి.. కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 24న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపింది.

29న కాజీపేటలో రిలే నిరాహార దీక్షలు, ఏప్రిల్ 5న దిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నేతలు పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకూ తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ ఆవశ్యకతపై చైతన్య యాత్రను నిర్వహించబోతున్నట్లు వారు వెల్లడించారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి.. ఫ్యాక్టరీ నెలకొల్పాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: కౌంటింగ్​ కేంద్రాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది: కోదండరాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.