లాక్డౌన్ (Lockdown) కారణంగా నిత్యావసర సరుకులు ముందే సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో వరంగల్ నగర వాసులతో పలు దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. ఉదయం 10 గంటల వరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో హన్మకొండలోని పలు దుకాణాలను ఉదయాన్నే తెరిచారు.
ఆదివారం కావడంతో కుమారపల్లి కూరగాయల మార్కెట్కు జనాలు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మాంసం దుకాణాల వద్ద మాంసప్రియులు బారులు తీరారు. కొవిడ్ నియమాలు పాటించకుండా గుంపులు గుంపులుగా ఉండటం ఆందోళనకు దారితీస్తోంది.
ఇదీ చదవండి: పాతబస్తీలో ఉద్రిక్తత.. పోలీసులతో యువకుల వాగ్వాదం