వరంగల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ హన్మకొండ బస్టాండ్ నుంచి అమరవీరుల స్థూపం వరకు మహా ప్రదర్శన నిర్వహించారు. వీరికి పీఆర్టీయూ, ఎంఆర్పీఎస్ మద్దతు తెలిపాయి. భారీ ర్యాలీగా వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. అమరవీరుల స్థూపం వద్ద ఆర్టీసీ బస్సును ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ఈ సంఘటనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు కొంత మందిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ఇవీ చూడండి: ఉద్యోగం పోయిందనే మనస్థాపంతో ఆర్టీసీ డ్రైవర్ మృతి!