వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి మండలంలోని పెగడపల్లిలో న్యాయం చేయాలంటూ టవర్ ఎక్కిన యువతి ఎట్టకేలకు కిందికి దిగింది. 7 గంటల పాటు నిరసన తెలిపిన ఆమె... పోలీసుల హామీతో పోరాటాన్ని విరమించింది.
న్యాయం జరగలేదని....
మాలికతో గత పదేళ్లుగామోశా అలియాస్ బాబు ప్రేమాయణం నడుపుతున్నాడు. అయితే కొన్ని రోజులగా పెళ్లి చేసుకుందామని బాధితురాలు అడగడంతో ముఖం చాటేశాడు. న్యాయం చేయాలని కోరుతూ షీ టీంను ఆశ్రయించినా... నిరాశే ఎదురైంది. విసుగు చెందిన మాలిక... సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపింది. అన్ని విధాలుగా వాడుకొని ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నాడని ఆరోపించింది.
పెళ్లే కావాలి..
అమ్మాయిని కిందికి దించేందుకు పోలీసులు, బంధువులు నానా తంటాలు పడ్డారు. అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానని మాటిస్తేనే కిందికి దిగుతానని ఉదయం నుంచి భీష్మించుకు కూర్చుంది. పోలీసుల హామీతో చివరికి తన దీక్ష విరమించింది. యువతి దిగి రావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి:రవళి అంత్యక్రియలు