ETV Bharat / state

ఇప్పటికే కబ్జా అయింది.. ఇంకేం కడతారు?: ఎమ్మెల్యేతో వాగ్వాదం - ప్రభుత్వ చీఫ్ విప్

హన్మకొండలోని సిద్ధేశ్వరాలయానికి చెందిన భూమిలో.. ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దంటూ అర్చకులు ఎమ్మెల్యే వినయభాస్కర్​తో వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే ఆలయానికి చెందిన ఎకరాల కొద్ది భూములు కబ్జాకు గురైయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

priests anger at warangal west mla related land occupy
ఇప్పటికే కబ్జా అయింది.. ఇంకేం కడతారు!
author img

By

Published : Jan 2, 2021, 5:48 PM IST

ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్​పై వరంగల్​లోని ఓ ఆలయ అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొ. జయశంకర్ స్మృతివనం నిర్మాణానికి.. స్థల పరిశీలీన కోసం ఎమ్మెల్యే హన్మకొండలోని సిద్ధేశ్వరాలయం పరిసర ప్రాంతాలకు వెళ్లారు. ఈ క్రమంలో.. దేవాలయానికి సంబంధించిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దంటూ అర్చకులు ఆయనతో వాగ్వాదానికి దిగారు.

ఎన్నో ఏళ్ల నుంచి నిధులు రాకపోయినా తాము ఆలయ అభివృద్ధికి పాటు పడుతున్నాం. ఆలయానికి చెందిన 15ఎకరాలు ఇప్పటికే కబ్జాకు గురైయ్యాయి. భూమికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతోంది. కోర్టు తీర్పును అందరూ గౌరవించాలి.

- సిద్ధేశ్వర ఆలయ అర్చకులు.

ఇదీ చదవండి : అధికార పార్టీ నేతల కబ్జాలో ప్రభుత్వ భూమి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.