విద్యుత్ తీగలు తగిలి బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన వరంగల్ నగరంలో చోటు చేసుకుంది. రంగశాయిపేటకు చెందిన అఫ్రిద్ అనే విద్యార్థి పాఠశాలకు సెలవు కావడం వల్ల ఇంటి పక్కన ఉన్న కళాశాల మైదానంలో క్రికెట్ ఆడేందుకు సహచరులతో వెళ్లాడు. క్రికెట్ బంతి తరగతి గదిపై పడిపోవటంతో ఎక్కి బంతిని తీసే క్రమంలో విద్యుత్ తీగ తగిలింది. షాక్తో పాటు అఫ్రిద్ ఒంటికి మంటలు అంటుకున్నాయి. పిల్లాడు బాధ తాళలేక చేస్తున్న కేకలు అక్కడి వాళ్లను కంటతడి పెట్టించాయి. స్థానికులు గమనించి బాలున్ని ప్రాణాలతో రక్షించారు. గాయపడిన అఫ్రిద్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: వేడుక నుంచి వస్తుండగా విషాదం