కేంద్రం విద్యుత్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆల్ ఇండియా ఐయన్‌టీయూసీ అధ్యక్షుడు జీ.సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం భవిష్యత్ కార్యాచరణపై వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండలో సమావేశం నిర్వహించారు. ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు.
కేంద్రం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడుతోందని... తక్షణమే ఆ ఆలోచనను విరమించుకోవాలని సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆ మేరకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇది చదవండి: సమస్యల పరిష్కారానికి 'కరంటోళ్ల నిరాహార దీక్ష'