వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. వరంగల్ డిపో-1, వరంగల్ డిపో-2తో పాటు హన్మకొండ బస్ డిపో వద్ద పోలీసులు తెల్లవారుజాము నుంచే మోహరించారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ప్రయాణికులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు పోలీసుల సహకారంతో డిపోల నుంచి బస్సులను రోడెక్కించారు. కార్మికులు డిపోల వద్దకు రాకపోవడం వల్ల హన్మకొండ బస్టాండులో ప్రశాంత వాతావరణం నెలకొంది.
ఇవీ చూడండి: ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం!