వరంగల్ కార్పొరేషన్‌లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొవిడ్ నిబంధనల నడుమ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వరంగల్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లకు సంబంధించి 878 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6 లక్షల 63,240 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 66 డివిజన్లలో 500 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వరంగల్‌లో మధ్యాహ్నం 1 వరకు 37.98 శాతం ఓటింగ్ నమోదైంది.
46 పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ క్యాస్టింగ్ చేస్తుండగా.. 561 కేంద్రాల్లో సీసీటీవీల ద్వారా పోలింగ్‌ను రికార్డు చేస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతోపాటు పలువురు ప్రముఖులు, యువతీ యువకులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు వేశారు.
ఇదీ చూడండి : లైవ్ అప్డేట్స్: రాష్ట్రంలో కొనసాగుతున్న మినీ పుర పోరు పోలింగ్