Peddi Sudarshan Reddy comments on YS Sharmila: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆంధ్రాలో ఓటు వేసి.. తెలంగాణాలో రాజకీయాలు చేయడమేమిటని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ మండిపడ్డారు. హైకోర్టు షరతులకు లోబడి పాదయాత్ర చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని.. వ్యక్తిగత దూషణలు చేస్తే మాత్రం.. ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హనుమకొండలో హెచ్చరించారు. షర్మిలదంతా "కేంద్ర..ఆంధ్ర" డ్రామాగా పెద్ది అభివర్ణించారు.
తెలంగాణ సమస్యలపై ఏనాడూ నోరుమెదపని షర్మిల.. తెలంగాణ బిడ్డనని చెప్పుకోవడంలో అర్థం లేదని విమర్శించారు. కేంద్రం ఏడు మండలాలు గుంజుకున్నప్పుడు షర్మిల ఎందుకు మౌనం వహించిందో చెప్పాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ సీఎం అడ్డం పడడం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపు మొదలైన అంశాలపై షర్మిల వైఖరి ఏమిటో పాదయాత్రలో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
"వైఎస్ షర్మిల పాదయాత్ర చేసినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై, వ్యక్తిగత దూషణలకు దిగితే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. గత ఎన్నికలో షర్మిల ఏ రాష్ట్రంలో ఓటు వేశారు. ఎక్కడ సమస్యలపై ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటిపై ప్రశ్నించు. రాజన్న రాజ్యాన్ని కూల్చే తెలంగాణను సాధించుకున్నాం." -పెద్ది సుదర్శనరెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే
ఇవీ చదవండి: