ఇదీ చూడండి: పైవంతెన ప్రమాదాలపై జీహెచ్ఎంసీ అప్రమత్తం
హన్మకొండలో పాయల్ సందడి.. ర్యాంప్‌పై హొయలు - మిస్టర్ అండ్ మిస్సెస్ వరంగల్
ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ హన్మకొండలో సందడి చేశారు. మిస్టర్, మిస్సెస్ వరంగల్ పోటీలకు హాజరై అభిమానులను అలరించారు.
హన్మకొండలో పాయల్ సందడి.. ర్యాంప్‌పై హొయలు
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో ఆర్ఎక్స్ 100 సీని హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సందడి చేశారు. హంటర్ రోడ్డులో బిల్కుష్ సంస్థ నిర్వహించిన మిస్టర్, మిస్సెస్ వరంగల్ పోటీలకు హాజరై.. వేదికపై నడుస్తూ అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో యువతీ, యువకులు సాంప్రదాయ దుస్తులతో అలరించారు. న్యాయ నిర్ణేతలు మిస్టర్, మిస్సెస్ వరంగల్‌ను ఎంపిక చేశారు. ఓరుగల్లుకు రావడం ఆనందంగా ఉందని పాయల్ తెలిపారు.
ఇదీ చూడండి: పైవంతెన ప్రమాదాలపై జీహెచ్ఎంసీ అప్రమత్తం
sample description