ఆకాశం మేఘావృతం కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు ఉదయం సూర్యగ్రహణాన్ని వీక్షించలేకపోయారు. 10 గంటలకు కాస్త మబ్బులు తొలగిన అనంతరం.. కొన్ని చోట్ల ప్రజలు సూర్యగ్రహణాన్ని వీక్షించారు. మరి కొంతమంది తమ చరవాణిల్లో గ్రహణ కదలికలను బంధించే ప్రయత్నం చేశారు. జనగామ, మహబూబాబాద్‌లలో పలు చోట్ల పాక్షికంగా సూర్యగ్రహణం కనిపించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో ఉదయం చిరుజల్లులు కురిశాయి.
ఇదీ చూడండి: బోర్డు పునర్‌వ్యవస్థీకరణతో పట్టాలపైకి... రైల్వే!