వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని హరిత హోటల్‌లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పంటల కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యేలు రమేశ్, చల్లా ధర్మారెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, అధికారులు హాజరయ్యారు.
సుదర్ఘీంగా 4 గంటల పాటు పంటల కొనుగోళ్లపై సమీక్షించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పంటలు కొనుగోలు చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు. నవంబర్ 1 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు. తేమ శాతం, తాలు లేకుండా వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి దయాకర్ రావు కోరారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: రైతన్న ఆక్రోశం.. దోమ సోకిన పంటకు నిప్పు