ETV Bharat / state

కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి ఎర్రబెల్లి

జిల్లాలో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్​భాస్కర్​తో కలిసి జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు.

కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి ఎర్రబెల్లి
కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Aug 14, 2020, 10:44 PM IST

కరోనా రోగుల చికిత్స కోసం మరిన్ని వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పేర్కొన్నారు. వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్​, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఎంజీఎం, పీఎంఎస్​ఎస్​వై ఆస్పత్రుల అభివృద్ధి, బాధితులకు అందిస్తున్న చికిత్స తదితర అంశాలపై చర్చించారు.

ఎంజీఎం, పీఎంఎస్​ఎస్​వై ఆస్పత్రుల్లో కొవిడ్​ రోగుల కోసం 600 బెడ్లను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎంజీఎంలో ప్రస్తుతం 250 బెడ్లు ఉన్నాయని... వారం రోజుల్లో మరో 50 బెడ్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అదేవిధంగా పీఎంఎస్​ఎస్​వై ఆస్పత్రిలో 106 బెడ్లను 20 రోజుల్లోగా అందుబాటులోకి తెస్తామన్నారు.

ఇప్పటి వరకు పీజీ కోర్సు పూర్తి చేసిన 117మందికి సీనియర్ రెసిడెంట్స్ పోస్టింగ్ ఇస్తే కేవలం 88 మంది మాత్రమే చేరారని... వారిలో 68 మంది విధులకు హాజరవుతున్నారని తెలిపారు. అదేవిధంగా ఎంబీబీఎస్​ పూర్తి చేసిన 29 వైద్యులకు ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పటి వరకు పది మంది మాత్రమే చేరారని స్పష్టం చేశారు. ప్రతి రోజు ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా చికిత్సకు సంబంధించి బులిటెన్​ విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు.

ఇదీ చూడండి: ఒకే వారంలో భార్యా, భర్త మృతి.. అనాథలైన పిల్లలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.