వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రధానంగా వృద్ధులు ఎంతో ఉత్సాహంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాళ్ల నొప్పులు నడవనీయకపోయిన, ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ... మెళ్లిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓట్లు వేసి నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారికి ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటామని.... ఓటేయ్యకపోతే చనిపోయినట్టేనని తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు.
ఇవీ చూడండి: పోలింగ్ ఆపేసి సిబ్బంది అల్పాహారం.. ఓటర్ల ఆగ్రహం..