నాలాల చుట్టూ ఆక్రమణల తొలగింపు... నెల రోజుల్లో పూర్తి చేస్తామని వరంగల్ పట్టణ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. ఇప్పటికే తొలగింపు ప్రక్రియ పూర్తి స్ధాయిలో కొనసాగుతోందని స్పష్టంచేశారు. నయీంనగర్ నాలా పరిధిలో ఉన్న అక్రమణలను బల్దియా కమిషనర్ పమేలా సత్పతితో కలసి పరిశీలించారు.
415 అక్రమ నిర్మాణాలు గుర్తించామని బఫర్ జోన్ నిబంధనల మేరకు నిర్మాణాల తొలగింపు చేపడతున్నట్లు వెల్లడించారు. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని. నగరంలో 923 భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. ఇందులో 200 వరకు కూల్చివేశామని చెపుతున్న జిల్లా కలెక్టర్‌తో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి.
ఇదీ చూడండి: కాంగ్రెస్‌లో నాయకత్వ సంక్షోభం కొత్తేమీ కాదు!