వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ముస్లిం సోదరులు ఇంట్లోనే ఉండి రంజాన్ వేడుకలను జరుపుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈద్గాలకు, మసీదుల వద్దకు వెళ్లలేరు. ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేసుకున్నారు.
నగరంలోని బొక్కలగడ్డ ఈద్గా ప్రతి ఏడు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులతో కిటకిటలాడేది. కానీ కరోనా కారణంగా ఈ ఏడు వెలవెలబోయింది. ముస్లిం సోదరులు ఎవరు రాకుండా ఈద్గాల వద్ద పోలీసులు విధులు నిర్వహించారు.
ఇవీ చూడండి: గొర్రెకుంట బావి ఘటనలో వీడిన మిస్టరీ.. ప్రేమ వ్యవహారమే కారణమా?