ETV Bharat / state

పేరుకే పెద్దాసుపత్రి.. మందులు మాత్రం ఉండవు... - యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్స్​

రాష్ట్రంలో అదో పెద్ద నగరం. ఉత్తర తెలంగాణలో పేదలకు ఏ పెద్ద రోగమొచ్చినా అక్కడకే పరుగు పెడతారు. అంతపెద్ద ఆసుపత్రిలో మందులు మాత్రం ఉండవు. కోతి, కుక్క కరిస్తే తమవద్దకు రావొచ్చని చెప్పేస్తారు. ఇదేంటని అడిగితే.. పైనుంచి రావట్లేదు. అప్పటి దాక ఇంతే అని తెగేసి చెబుతున్నారు.

పేరుకే పెద్దాసుపత్రి.. మందులు మాత్రం ఉండవు...

author img

By

Published : Dec 25, 2019, 6:30 AM IST

పేరుకే పెద్దాసుపత్రి.. మందులు మాత్రం ఉండవు...

పేదల పాలిట పెన్నిధిగా.. పెద్దాసుపత్రిగా పేరొందిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని మందుల కొరత వేధిస్తుంది. కుక్క, కోతుల కారణంగా గాయపడ్డ బాధితులంతా ఆస్పత్రి ముందు బారులు తీరుతున్నారు. రెండు మూడు రోజుల నుంచి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ల కోసం ఆసుపత్రి చుట్టూ తిరుగుతుంటే.. వైద్య సిబ్బంది మందుల్లేవంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు.

పదిహేను రోజుల నుంచి కొరత:

ఉమ్మడి వరంగల్ జిల్లాలలో చిన్నపిల్లలతో పాటు.. పెద్దవాళ్లు కూడా జంతువుల బారిన పడి రోజూ గాయాలపాలవుతున్నారు. పరకాల, నర్సంపేట, మహబూబూబాద్, పాలకుర్తి, జనగామ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో పదిహేను రోజుల నుంచి వ్యాక్సిన్ కొరత నెలకొంది. బాధితులకు అవసరమైన మేరకు వ్యాక్సిన్ సరఫరా కాకపోవడం వల్ల ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

స్టాక్​ రావట్లేదు..

కేంద్ర ఔషధ గిడ్డంగి నుంచి రావాల్సిన స్టాక్ రావట్లేదని.. అందుకే వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోయిందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస రావు తెలిపారు. వైద్య ఆరోగ్య సంచాలకులకు వ్యాక్సిన్ కొరత గురించి తెలియజేశామని.. అప్పటివరకు కొరత తప్పదన్నారు. యుద్ధప్రాతిపదికిన యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ సరఫరా చేసి వ్యాక్సిన్ కొరత తీర్చాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:హైకోర్టుకు దిశ నిందితుల రీపోస్టుమార్టం వీడియో సీడీ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.