ETV Bharat / state

ఈ ఫ్రిజ్‌లో ఉంచితే వైరస్‌ రహితంగా కూరగాయలు, సామగ్రి

కరోనా వైరస్ అందరినీ కలవరపెడుతోంది. దేనిమీద వైరస్ ఉందో తెలియక... దడపుడుతోంది. అందుకే కూరగాయలు, ఇతర సామగ్రిని తీసుకొచ్చి శుభ్రం చేసుకుని వాడుకోవాల్సి వస్తుంది. ఐతే ఇది శ్రమతో కూడుకున్నదే. ఇలాంటి శ్రమ లేకుండా కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా వరంగల్ నిట్​ ఆచార్యులు.. ఓజోనిట్ పేరుతో ఫ్రిజ్ లాంటి సరికొత్త పరికరాన్ని రూపకల్పన చేశారు.

nit professors invented virus free ozonit sterilize device
ఈ ఫ్రిజ్‌లో ఉంచితే వైరస్‌ రహితంగా కూరగాయలు, సామగ్రి
author img

By

Published : Aug 1, 2020, 3:36 AM IST

ఈ ఫ్రిజ్‌లో ఉంచితే వైరస్‌ రహితంగా కూరగాయలు, సామగ్రి

ఆగస్టు నెల వచ్చేసింది.. అయినా కరోనా కలవర పాటు తగ్గలేదు సరికదా మరింత పెరిగింది. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు చూస్తుంటే కంటిమీద కునుకే రావట్లేదు. మార్కెట్​కు వెళ్లి కూరగాయలు, పళ్లు తేవాలన్నా, దుకాణాలకు వెళ్లి సరుకులు తేవాలన్నా.. ఎక్కడ వాటి మీద వైరస్‌ ఉందో?.. అది ఎక్కడ మనకు అంటుకుంటుందోనన్న భయం వెంటాడుతోంది. దీంతో తీసుకొచ్చిన కూరగాయలు, ఇతరత్రా వస్తువులను శుభ్రం చేయడానికి అధిక సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఇంత చేసినా కూడా ఇంకా ఏ మూలో తెలియని భయం. ఇక ఆభరణాలు, సెల్ ఫోను, బట్టలు ఇలా మనం ధరించిన వాటిపైనా... మన చేతుల్లో ఉన్నవాటిపైనా వైరస్ ఉండవచ్చు. ఐతే తరచూ శానిటైజ్ చేసుకోవడం కుదరని పని. నీటితో కడగకుండా, శానిటైజ్ చేసుకోకుండా ఎలా ఉంచుకోవాలనే దానికి పరిష్కారమార్గంగా...ఆల్‌ ఇన్‌ ఓజోనిట్ అనే కొత్త పరికరం పరిష్కార మార్గం చూపుతుందంటున్నారు వరంగల్ నిట్‌ భౌతికశాస్త్ర అధ్యాపకులు.

నిట్ భౌతిక శాస్త్ర విభాగాధిపతి ఆచార్య దినకర్ సహకారంతో సహ ఆచార్యులుడి. హరినాథ్, పరిశోథక విద్యార్ధి చందర్ రావులు సంయుక్తంగా స్టెరిలైజ్డ్ పరికరాన్ని రూపకల్పన చేశారు. ఇంట్లో ఉపయోగించే... రిఫ్రిజిరేటర్ లాంటి పరికరంలా కనిపించే ఇందులో కూరగాయలు ఇతరత్రా ఏ వస్తువలనైనా ఉంచి... ఓజోన్ వాయువును ఉత్పత్తి చేసేలా స్విచ్​ ఆన్‌ చేస్తారు. 20-25 నిమిషాల పాటు వరకూ వస్తువులను ఓజోన్ వాయువులో ఉంచితే 99.99 శాతం అవి వివిధ రకాల వైరస్, బ్యాక్టీరియా రహితంగా మారతాయంటున్నారు నిట్ ఆచార్యులు. అతినీలలోహిత కిరణాల కంటే ఈ విధానం ఎంతో ఉపయుక్తమని చెబుతున్నారు.

ఈ ఫ్రిజ్‌లో ఉంచిన వస్తువుల్లో నాణ్యత తగ్గడం, కూరగాయలు, పండ్లకు సంబంధించి రుచి తగ్గడం కూడా ఉండదని.. ఖర్చు కూడా పెద్దగా అవ్వదని అంటున్నారు. చిన్నపాటి మార్పులు చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని నిట్‌ ఆచార్యులు చెబుతున్నారు.

ఇవీ చూడండి: 'నాకు కరోనా వస్తే.. తగ్గిన వెంటనే ప్లాస్మాదానం చేస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.