ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా అర్బన్ జిల్లాలో 20 మందికి మహమ్మారి సోకగా.. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి. అయితే కొవిడ్ విజృంభిస్తున్నందున వరంగల్ వర్తకులు స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలను కుదించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకే దుకాణాలు తెరుస్తున్నారు.
ఇదిలా ఉంటే సెలూన్ షాపుల నిర్వాహకులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను జులై 1 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వరంగల్ నగరంలో కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు. కేసులు నమోదైన ప్రాంతాలలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశారు. ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే జరుపుతున్నారు.