వరంగల్ జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. బట్టల బజార్లోని శ్రీ కాళీ సేన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో అమ్మవారికి సప్త హారతులను సమర్పించారు. ఉగ్రరూపంలో కొలువుదీరిన అమ్మవారిని చూసేందుకు భక్తులు బారులు తీరారు.
సప్త హారతులు చూసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని... మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చదవండి: మహా గౌరీదేవి అలంకరణలో వర్గల్ విద్యా సరస్వతీ అమ్మవారు...