వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్)లో జాతీయ యువజనోత్సవాలు జరుగుతున్నాయి. మూడో రోజు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిట్ సందర్శనకు వచ్చారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక అంశాలను వివరించారు. ప్రముఖ వ్యాఖ్యాత అప్పల ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. స్వామి వివేకానంద బోధనలు స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు.
ఇదీ చూడండి : 'ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగింది'