ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఓసీ సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పొలాది రామారావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31లోగా ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేశారు.
ఈ నెల 31న నిర్వహించే ఓసీ సంఘాల ఐకాస జాతీయ సభ గోడ ప్రతులను వరంగల్లో ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేస్తే మహా గర్జనను అభినందన సభగా జరుపుతామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అహింసతో స్వతంత్ర సంగ్రామాన్ని ఉరకలెత్తించారు : సీఎం కేసీఆర్