వరంగల్ జిల్లావ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాగేంద్ర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పుట్టల వద్దకు చేరుకుని స్వామికి పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం మహిళలు ప్రత్యేక పూజలు చేసి ఒకరికొకరు వాయనం సమర్పించుకుంటున్నారు. వేయి స్తంభాల ఆలయం, పబ్లిక్ గార్డెన్స్‌లోని పుట్టల వద్దకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ చదవండిః శ్రీశైలానికి భారీగా వరద.. 860 అడుగులు దాటిన నీటిమట్టం