వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని రహదారులు చిన్న చినుకు పడితే చాలు బురదమయమయ్యాయి. అడుగుకో గుంత వల్ల ప్రయాణించడానికి నరకప్రాయంగా మారాయి. వాన పడితే చాలు.... ఎక్కడ గుంతలున్నాయో ఎక్కడ రోడ్డుందో అర్థం కాని పరిస్థితి. ఆ గుంతల్లో పడి ఎందరో గాయాలపాలయ్యారు. మరికొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా అధికారులకు పట్టింపులేదు. అడుగుకో గోతితో అధ్వాన్నంగా మారిన హన్మకొండ రహదారులను పట్టించుకునే వారే లేరంటూ నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- ఇదీ చూడండి : ఇవి తింటే... ఇక అంతే..!