ETV Bharat / state

SUICIDE ATTEMPT: తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తల్లీకుమారుడి ఆత్మహత్యాయత్నం - తెలంగాణ వార్తలు

వేలేరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తల్లీకుమారుడు ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Jul 12, 2021, 5:33 PM IST

Updated : Jul 12, 2021, 8:22 PM IST

17:30 July 12

వేలేరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తల్లీకుమారుడు ఆత్మహత్యాయత్నం

వేలేరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట తల్లీకుమారుడు ఆత్మహత్యాయత్నం

వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తల్లీకుమారుడు ఆత్మహత్యకుSUICIDE ATTEMPT) యత్నించారు. భూ సమస్యలు(LAND ISSUES) పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెట్రోల్ మీద పోసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని అడ్డుకున్నారు.  

ఏం జరిగింది?

వేలేరు మండల కేంద్రానికి చెందిన మహ్మద్ మహబూబి, ఆమె కూమారుడు ఖాసీంకు సర్వే నంబర్ 729/A2లో 0.14 గుంటలు, 729/B లో 0.26 గుంటలు భూమి ఉందని తెలిపారు. 2005 లో రూ.41,000కు  కొనుగోలు చేశామని వెల్లడించారు. సాదాబైనామాలో దరఖాస్తు చేసుకోగా మహబూబి పేరున 1బి పహాణి వచ్చిందని పేర్కొన్నారు. పదిహేనేళ్ల నుంచి తమ ఆధీనంలో ఉందని వివరించారు.  

న్యాయం చేయండి

ఆ భూమిని 2005లో అమ్మలేదని... కొంతమంది వ్యక్తులు 2018లో అధికారులకు డబ్బులు ముట్టజెప్పి వారి పేరున పట్టా చేసుకున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి పేరున పట్టా అయిన విషయం తమకు తెలియదని వాపోయారు. ఆ భూమిని తామే కొనుగోలు చేశామని చెప్పారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పింది.  

ఇదీ చదవండి: Kaushik Reddy: కాంగ్రెస్‌ పార్టీకి కౌశిక్‌రెడ్డి రాజీనామా

Last Updated : Jul 12, 2021, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.