ETV Bharat / state

Monsoon in Telangana Delayed : తొలకరి కోసం రైతుల ఎదురుచూపులు

Monsoon Delayed In Telangana : మృగశిర కార్తొచ్చి పదిరోజులవుతున్నా తొలకరి జాడ లేకపోవటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే దుక్కులు దున్నిన కర్షకులు.... చాలా చోట్ల విత్తనాలు విత్తారు. వారం రోజులుగా తొలకరి కోసం ఎదురు చూస్తున్నా..... వరుణుడు మాత్రం కరుణించటంలేదు. రుతుపవనాల రాక ఆలస్యం కాగా.... ప్రస్తుత వాతావరణం ఇంకా మండువేసవినే తలపిస్తోంది. వడగాల్పులు, మండుతున్న ఎండలతో విత్తిన విత్తనాలు మొలకెత్తటం కష్టమేనని రైతులు వాపోతున్నారు.

No Rains
No Rains
author img

By

Published : Jun 16, 2023, 8:04 AM IST

తొలకరి కోసం రైతుల ఎదురుచూపులు

Monsoon Rains are delayed Telangana : వానాకాలం సాగు కోసం రైతులు పొలాలను సిద్ధం చేసినా.... తొలకరి చినుకు జాడలేదు. సాధారణంగా జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి వస్తుంటాయి. మృగశిర కార్తె వరకు తొలకరి జల్లులు కురుస్తుంటాయి. కానీ... ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యం కాగా... ఇప్పటి వరకు తొలకరి చినుకులు మాత్రం కురవలేదు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా అన్నిచోట్ల దుక్కి దున్ని పొలాలను సిద్ధం చేసుకున్న రైతులు.... చాలా చోట్ల విత్తనాలు సైతం విత్తారు. గతేడాది ఈ సమయానికి వర్షం పడి, పత్తి విత్తనాలు మొలకెత్తాయి. కానీ... ఈ సంవత్సరం ఇప్పటికీ వర్షాలు రాకపోవటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

Monsoon in Telangana Delayed : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పరకాల, భూపాలపల్లి ప్రాంతాల్లో చాలా చోట్ల ఇప్పటికే పత్తి విత్తనాలు వేశారు. వానాకాలం సాగు ప్రారంభం కావటంతో ఒకరిని చూసి మరొకరు విత్తనాలు విత్తుకున్నారు. విత్తనాలు , ఎరువుల కొరత ఉన్నా.... బ్లాక్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వానలు కురవకపోవటంతో ఇప్పటి వరకు చేసిన ఖర్చు వృథా అవుతుందని వాపోతున్నారు.

Monsoon Delayed In Telangana : వర్షాల రాక ఆలస్యమవుతున్న తరుణంలో విత్తనాలు వేయవద్దని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. సరైన వర్షపాతం నమోదు కాని పరిస్థితుల్లో పొడి దుక్కుల్లో విత్తనాలు విత్తితే మొలకెత్తే అవకాశం ఉండదని చెబుతున్నారు. తొందరపడితే మొలక శాతం తగ్గుతుందని, కనీసం 60ఎమ్​ఎమ్​ వర్షపాతం నమోదైతే మాత్రమే విత్తనాలు నాటాలని సూచిస్తున్నారు.

Farmers faces issues Due Delay in Rain : ఇదిలా ఉండగా... తొలకరి మరికొంత ఆలస్యం కానుందని వాతావరణశాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు నాలుగు రోజులుగా ముందుకు కదలడంలేదని.... ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దును తాకిన రుతుపవనాలు... ఇప్పటికే కర్ణాటకలో వ్యాపించాల్సి ఉన్నా ఏపీలోనే స్తంభించిపోయినట్లు తెలిపారు. ఈ క్రమంలో 19వ తేదీ నాటికిగానీ అవి రాష్ట్రంలోకి ఎప్పుడు వచ్చేది అంచనా వేయలేమని వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణంగా రుతుపవనాలు జూన్‌ 10న తెలంగాణను తాకాల్సి ఉండగా.... జూన్‌ మొదటివారం ముగిసే నాటికి ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠంగా 38 డిగ్రీల నుంచి 37 డిగ్రీలకు చేరుకోవాలి. అయితే ఈ ఏడాది వాటి రాక ఆలస్యమవడంతో 15వ తేదీలోపు వస్తాయని ఐఎమ్​డీ ప్రకటించినా... ఈ అంచనా కూడా తప్పిపోయింది. అదేసమయంలో రాష్ట్రంలో వడగాలుల తీవ్రత కొనసాగుతోంది. జూన్‌ రెండోవారం ముగుస్తున్నా ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. మూడేళ్ల క్రితం ఇలాంటి వేడి వాతావరణ పరిస్థితి రాష్ట్రాన్ని అల్లాడించింది.

'70 నుంచి 75 శాతం వరకు రైతులు విత్తనాలను వేశారు. ఈ వారం రోజుల్లో మిగతా రైతులు కూడా వేసే అవకాశం ఉంది. ఇప్పుడు వేస్తే మొలక శాతం సరిగ్గా వచ్చే అవకాశం లేదు. 60 ఎమ్​ఎమ్ వర్షపాతం నమోదు అయితే కానీ మొలక శాతం సరిగా రాదు.' - రవీందర్, వ్యవసాయాధికారి, పరకాల

నైరుతి రుతుపవనాలు ఉన్నచోటు నుంచి కదలకపోవడం వల్లే తెలంగాణకు తొలకరి ఆలస్యమవుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పసిఫిక్‌ మహాసముద్రం నుంచి వీచే గాలులు బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం ఉపరితలాలపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎల్‌నినో లాంటి పరిస్థితితో మేఘాలు ఏర్పడటంతో గాలిలో కదలికలు నెమ్మదిగా ఉన్నాయన్నారు. గుజరాత్‌ తీరంలో ఏర్పడిన తుపాను కారణంగా తేమ గాలులు అటువైపు తరలిపోవడంతో నైరుతి రుతుపవనాల విస్తరణ ఆగిపోయిందన్నారు. రుతుపవనాల కదలికలు తగ్గిపోవడంతోపాటు ఇప్పటికే విస్తరించిన చోట కూడా సరైన వర్షాలు లేవని చెబుతున్న వాతావరణ శాఖ అధికారులు... వచ్చే సోమవారం నాటికి వాతావరణంలో మార్పులపై ఏమీ చెప్పలేమంటున్నారు.

రాష్ట్రంలోని 16 జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఖమ్మం, ములుగు, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలపై వీటి ప్రభావం ఉంటుందని తెలిపింది. శనివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.