ETV Bharat / state

corona: 'కొవిడ్​ని అరికట్టడంలో మోదీ, కేసీఆర్​ విఫలం'

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ప్రైవేటు ఆస్పత్రులను వెంటనే తమ ఆధీనంలోకి తీసుకుని పేద ప్రజలను కాపాడాలని సూచించారు. కరోనా(corona), బ్లాక్ ఫంగస్ బాధితులకు అయ్యే ఖర్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని తెలిపారు.

warangal news today
corona: 'కొవిడ్​ని అరికట్టడంలో మోదీ, కేసీఆర్​ విఫలం'
author img

By

Published : Jun 7, 2021, 3:14 PM IST

కరోనా(corona) మహమ్మారిని కట్టడి చేయలేని ప్రధాని మోదీ నైతిక భాద్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలనీ వరంగల్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా కాoగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సత్యాగ్రహ దీక్షకు పూనుకున్నారు. కరోనా, బ్లాక్ ఫంగస్ బాధితులకు అయ్యే ఖర్చు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని కోరారు.

ప్రైవేటు ఆస్పత్రులను వెంటనే తమ ఆధీనంలోకి తీసుకుని పేద ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. కొవిడ్​ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా… ప్రధాని సమస్యలను గాలికొదిలేసి మీనా వేషాలు వేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు వాపోయారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ… కరోనా మహమ్మారిని అరికట్టడంలో విఫలం చెందిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్​ వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: Isolation: మందులు, ఆక్సిజన్‌, బెడ్‌... పేదలకు ఉచితమిక్కడ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.