ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగుల పక్షాన పోరాడతానని యువ తెలంగాణ పార్టీ అభ్యర్థి రాణి రుద్రమదేవి స్పష్టం చేశారు. హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
తెరాస విధానాలు.. పేదలకు విద్యను దూరం చేసే విధంగా ఉన్నాయని రుద్రమదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయారని మండిపడ్డారు. కరోనా సమయంలో.. రోడ్డు మీద పడ్డ ప్రైవేటు ఉపాధ్యాయులకు కనీస జీవన భృతి ఇవ్వలేని చేతగాని ప్రభుత్వమంటూ విమర్శించారు.
జర్నలిస్టుగా ప్రారంభమైన నా ప్రయాణం.. ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల వైపు మళ్లింది. ప్రత్యేక రాష్ట్రంలో.. ప్రజల ఆశలు నెరవేరతాయని ఆశించాం. ప్రభుత్వ వైఫల్యాలతో రాష్ట్రం పూర్తిగా నష్టపోతోంది. నన్ను ఆశీర్వదించి.. మీకు సేవ చేసుకునే అవకాశమివ్వండి.
- రాణి రుద్రమదేవి
ఇదీ చదవండి: మానుకోట రాళ్ల కిందే సమాధి చేస్తాం: సత్యవతి