లాక్డౌన్ నేపథ్యంలో అనేక మంది రోజువారీ కూలీలు, వలస కార్మికులు, హిజ్రాల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా మహమ్మారి ప్రపంచమంతటా వ్యాపించి లాక్‌డౌన్‌కు కారణమవడం వల్ల హిజ్రాలకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. వారికి పూట గడవడం కూడా కష్టమైంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హిజ్రాలకు నిత్యావసర వస్తువులు, బియ్యం పంపిణీ చేశారు. వరంగల్‌లో నివసిస్తున్న సుమారు 100 మంది హిజ్రాలకు నిత్యావసరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వినయ్ భాస్కర్‌తో పాటు గాయకుడు, బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ హాజరయ్యారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏ వ్యక్తి కూడా ఆకలితో ఉండకుండా తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తెరాస పార్టీ స్థాపించి 20 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ స్ఫూర్తితో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 20 వేల కుటుంబాలకు 'ఫీడ్ ద నీడ్' అనే పేరుతో కార్యక్రమం చేపట్టి నిత్యావసర సామగ్రి , బియ్యం అందజేస్తున్నామన్నారు.
ఇవీ చూడండి: 'అన్నం' పెడుతున్న సేవాసంస్థకు ఆర్పీఎఫ్ చేయూత