భాజాపా నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ హితువు పలికారు. త్వరలోనే ఆ పార్టీ నేతలకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు. వరంగల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలంగాణ సిద్దాంతకర్త జయశంకర్ సార్ స్మృతి వనాన్ని నిర్మించకుండా వారు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
జయశంకర్ సార్ చివరి కోరిక ఆయనను హన్మకొండలోని సిద్దేశ్వర ఆలయం పక్కన సమాధి చేశామని ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ తెలిపారు. ప్రభుత్వ అదేశాల మేరకు అక్కడ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడానికి కలెక్టర్ తో కలిసి స్థల పరిశీలనకు వెళ్లగా అక్కడ కొందరు తమను అడ్డగించారని ఆగ్రహవ్యక్తం చేశారు. అక్కడ ఉన్న దేవాలయ పూజరులకు భాజపా నేతలు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఆయన జ్ఞాపకాలేవి లేకుండా చేసేందుకు కాషాయ నేతలు కుట్రపన్నుతున్నారని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: ఆ రాష్ట్రంలోకి నక్సల్స్ చొరబాటు- బలగాల మోహరింపు